మహిళలకు అండగా ఉంటాం: మహిళా కమిషన్‌‌ చైర్ పర్సన్ ​నేరెళ్ల శారద

ఆదిలాబాద్​టౌన్, వెలుగు :మహిళల రక్షణతో పాటు అన్ని రకాలుగా అండగా ఉంటామని మహిళా కమిషన్‌‌ చైర్ పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలోని పెన్‌‌గంగా భవన్‌‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. మారుమూల గ్రామాల ఆడపిల్లలకు, మహిళలకు కమిషన్‌‌ అండగా ఉంటుందన్నారు. 

విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

నిర్మల్, వెలుగు: కస్తుర్బా గాంధీ విద్యాలయాల్లోని స్టూడెంట్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని నేరెళ్ల శారద ఆదేశించారు. నిర్మల్‌‌లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కాలేజీని ఆమె శనివారం తనిఖీ చేశారు.