మల్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామ సమస్యలు పరిష్కరిస్తా  : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

  • సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: సుడా పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి గ్రామంలోని శ్రీలక్ష్మీ హోమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీని పరిశీలించారు. మల్కాపూర్ మెయిన్ రోడ్డులో మురికి కాలువలు లేకపోవడంతో నీళ్లు నిలుస్తున్నాయని కాలనీవాసులు సుడా చైర్మన్​దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట సుడా డీఈ రాజేంద్రప్రసాద్, ఏఈ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాలనీవాసులు శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, వాసంతి, శ్రీలత, రామకృష్ణ, అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీపీ సెక్రటరీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.