పరిగి బస్టాండ్లో పట్టపగలే చైన్ స్నాచింగ్..బస్సు ఎక్కుతుండగా పుస్తెల తాడు చోరీ

వికారాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే మహిళ మెడలోంచి బంగారు చైన్ చోరీ చేశారు. బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడు దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వచ్చి చెక్ చేసిన చైన్ దొరకలేదు. ఆగంతకులు అప్పటికే పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన బుధవారం (జనవరి 8, 2025) వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

శివలీల అనే మహిళ రాజాపూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు పరిగి బస్టాండ్ కు వచ్చింది.. బస్సు ఎక్కే క్రమంలో తన మెడలోంచి బంగారు పుస్తెలతాడును చైన్ స్నాచర్లు దొంగిలించారు. 

Also Read :- హైదరాబాద్లో 11 HMPV కేసులు

బాధితురాలు వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో తనిఖీలు చేశారు. పాత నేరస్థులు ఎవరైనా ఉన్నారా అని ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తించేందుకు ప్రయత్నించారు..అయినా చైన్ స్నాచర్ దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.