YesMadam : ఉద్యోగుల తొలగింపు .. ఎస్ మేడం సీఈఓ క్షమాపణలు

ఉద్యోగులను తొలగించినందుకు క్షమాపణలు చెప్పారు హోమ్ సెలూన్ సర్వీసెస్ స్టార్టప్  ఎస్ మేడమ్ సీఈవో మయాంక్ ఆర్య.  నేను మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను . నేను ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమించండి. నేను ఉద్యోగులెవరినీ  తొలగించలేదు, ఇమెయిల్‌లు కూడా పంపలేదు.  కంపెనీలో ఎటువంటి భయాందోళనలు లేవు.  ప్రతి ఉద్యోగి ఈ ప్రచారంలో పాల్గొన్నారని సీఈవో మయాంక్ వీడియో రిలీజ్ చేశారు.

 ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పిన ఉద్యోగులను తొలగించినందుకు వివాదంలో చిక్కుకుంది. అంతర్గత మానసిక ఆరోగ్య సర్వే ఆధారంగా 100 మంది ఉద్యోగులను  యెస్‌మేడమ్  సంస్ధ తొలగించిందని స్క్రీన్‌షాట్ గత వారం సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది.   ఎక్కువ పని చేస్తున్నట్లు ఫిర్యాదు చేసిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  

దీంతో  యెస్‌మేడమ్ సీఈవో  వెంటనే  3 పేజీల లేఖతో వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఉద్యోగులను తొలగించలేదని ..కంపెనీ డి-స్ట్రెస్ లీవ్  పాలసీని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.