- 11 మందిపై కేసు..64 పశువులు స్వాధీనం
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ కు పశువులను అక్రమంగా తరలిస్తున్న 4 వాహనాలు ఆదిలాబాద్ జిల్లాలో పట్టుబడ్డాయి. 11 మందిపై కేసు నమోదు చేసి, 64 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిర్పూర్ టీ ఎస్ఐ కమలాకర్ కథనం ప్రకారం.. గురువారం సిర్పూర్టీ లో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్టు స్థానికుల నుంచి సమాచారం అందింది. 4 లారీలను పట్టుకొని బాధ్యులైన11 మందిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన పశువుల యజమాని సలీం ఖురేషీతో పాటు షేక్ తౌసిఫ్, షేక్ సోహైల్, షేక్ తౌహీద్, మోసిన్ ఖాన్, షేక్ నదీమ్, సచిన్, రాంటెంకి శైలేశ్, షేక్ హనీస్, రమేశ్ కుమార్, ఎండీ యూనిస్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.