పాల్వంచలో నగదు సీజ్

టేక్మాల్, వెలుగు: మండల పరిధిలోని పాల్వంచ శివారులో బీజేపీ ఆఫీస్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా సంగారెడ్డికి చెందిన అడ్వకేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వద్ద రూ.71,500, అతడి డ్రైవర్ ఫరీద్​వద్ద రూ.50,200 గుర్తించినట్లు ఎస్ఐ మురళీ తెలిపారు. ఈ నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడతో సీజ్​ చేసినట్లు చెప్పారు. అలాగే సిద్దిపేట జిల్లా అనంతసాగర్ చెక్​పోస్ట్​వద్ద చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ వాహన తనిఖీ నిర్వహిస్తుండగా సుంచు రాజు వాహనంలో రూ. 1,11,400 నగదు గుర్తించినట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్​ చేసినట్లు పేర్కొన్నారు.