ఇసుక అక్రమ రవాణా..9 మందిపై కేసు

జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండంలలోని ఇందారం గోదావరి నదిలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.  మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఇందారం గ్రామానికి చెందని కొంతమంది యువకులు గోదావరి నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.

రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. దీంతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు తెలియడంతో వారిని అరెస్టు చేసి 70 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసి రెవెన్యూ ఆఫీసర్లకు అప్పగించినట్లు పేర్కొన్నారు.