PAN 2.0: మీకు పాన్ కార్డ్ ఉందా..? ఈ విషయం తెలిస్తే పండగ చేస్కుంటరేమో..!

ఢిల్లీ: ప్రస్తుతం ఉన్నా పాన్ అకౌంటర్ నంబర్ విధానంలో మార్పులుచేర్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పన్ను చెల్లింపు సేవలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మరింత సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ నిధులు కేటాయించింది.

పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్రం రూ.1,435 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం వినియోగిస్తున్న టెక్నాలజీని పూర్తిగా అప్ డేట్చేసి పన్ను చెల్లింపుదారులకు మరింత చేరువగా సేవలను తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది.

పాన్ 2.0 ప్రత్యేకతలు:
* పాన్ 2.0 ప్రాజెక్టులో భాగంగా ఇకపై ఇష్యూ చేయబోయే పాన్ కార్డులు ఎంబెడెడ్ క్యూఆర్ కోడ్తో వస్తాయి. పాన్ కార్డు యూజర్లకు ఈ క్యూఆర్ కోడ్ మెరుగైన సేవలు పొందడానికి ఉపయోగపడుతుంది.
* ప్రభుత్వం అందించే పలు సేవల్లో ప్రస్తుతం డిజిటల్ ఫార్మాట్ ద్వారా అప్లై చేసేందుకు, అర్హత పొందేందుకు, లబ్ది పొందేందుకు ఈ పాన్ కార్డు 2.0 ఉపయోగపడుతుంది.
* ఎకో ఫ్రెండ్లీ, సెక్యూర్, ఫాస్ట్గా పాన్ సేవలను అందించడంపై ఈ పాన్ 2.0 ప్రాజెక్టు ఫోకస్ పెట్టింది.

పాన్ 2.0 కార్డు తీసుకుంటే లాభాలేంటి..?
* ట్యాక్స్పేయర్ రిజిస్ట్రేషన్ సేవలు త్వరితగతిన, యూజర్ ఫ్రెండ్లీగా పొందొచ్చు.
* ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న పాన్ కార్డు యూజర్లు కూడా పాన్ 2.0కి అప్గ్రేడ్ అవ్వొచ్చు.
* పాన్ 2.0 కార్డ్ పొందడం కోసం మళ్లీ కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదు.
* క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డును యూజర్లు పొందొచ్చు.

ప్రస్తుతం మన దేశంలో 78 కోట్ల పాన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో దాదాపు 98 శాతం వ్యక్తిగతమైనవే.