కవ్వాల్​లో కనువిందుచేస్తున్న బటర్ ఫ్లైలు

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్​లో బట్టర్ ప్లైలు(సీతాకోకచిలుకలు) పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బటర్ ఫ్లైల కోసం ఏడాది క్రితం గార్డెన్ ఏర్పాటు చేశారు. బటర్​ ఫ్లైలను ఆకర్శించేందుకు 7 రకాల ప్రత్యేక మొక్కలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గార్డెన్​లో పెంచుతున్నారు.

 ప్రస్తుతం మొక్కలు పెరిగి పెద్దవి కావడంతో వాటి నుంచి వచ్చే సువాసనకు సీతాకోకచిలుకలు వాటిపై వాలుతున్నాయి.  గార్డెన్​లో తిరుగుతూ ఉదయం, సాయంత్రం నర్సరీకి వచ్చే పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.