ఈవారం 3 ఐపీఓలు .. ఆరు లిస్టింగ్స్

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో మొదటివారం దలాల్​స్ట్రీట్​ బిజీగా ఉండనుంది. ఈవారంలో మూడు కంపెనీలు  ఐపీఓకు రానున్నాయి. ఆరు కంపెనీలు మార్కెట్లో లిస్ట్​ కానున్నాయి. ఫార్మ్​ఎక్విప్​మెంట్​, ట్రాక్టర్ల తయారీదారులు ఇండో ఫార్మ్​ఎక్విప్​మెంట్​లిమిటెడ్​  ఐపీఓ ఈ నెల 31న మొదలవుతుంది. వచ్చే నెల రెండో తేదీన ముగుస్తుంది.  ఐపీఓలో రూ.184.90 కోట్ల విలువైన ఫ్రెష్​ఇష్యూ, రూ.75.25 కోట్ల విలువైన ఓఎఫ్​ఎస్​ ఉంటుంది. ప్రైస్​ బ్యాండ్​ను 204–215 మధ్య నిర్ణయించారు. కెమికల్స్​, డైలు తయారు చేసే టెక్నికెమ్​ఆర్గానిక్స్ ఎస్​ఎంఓ​ ఐపీఓ కూడా ఈ నెల 31న మొదలవుతుంది. వచ్చే నెల రెండో తేదీన ముగుస్తుంది. 

ప్రైస్​బ్యాండ్​ను రూ. 52–55 మధ్య నిర్ణయించారు. కనీసం రెండు వేల షేర్లకు దరఖాస్తు చేయాలి. మూడో ఐపీఓ లియో డ్రైఫ్రూట్స్​ అండ్​స్పైస్  ట్రేడింగ్​ కంపెనీది. జనవరి 1–3 తేదీల్లో ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 8న లిస్టింగ్​ ఉంటుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.25.12 కోట్లు సేకరిస్తుంది. ప్రైస్​బ్యాండ్​ను రూ. 51–52 మధ్య నిర్ణయించారు. ఈ కొత్త ఐపీఓలతో పాటు, ఈ వారం మూడు మెయిన్​ బోర్డ్ పబ్లిక్ ఆఫర్‌‌‌‌లు   మార్కెట్‌‌‌‌లోకి ప్రవేశిస్తాయి. వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్, సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, కరారో ఇండియా లిమిటెడ్ షేర్లు లిస్టవుతాయి. యూనికెమ్​ ఏరోస్పేస్ లిస్టింగ్ డిసెంబర్ 31న ఉంటుంది. అన్యా పాలిటెక్,  సిటీకెమ్ ఇండియా లిమిటెడ్ లిస్టింగ్స్​ వరుసగా జనవరి 2, 3 తేదీల్లో ఉంటాయి.