ఇయ్యాల బెల్లంపల్లిలో బస్సు యాత్ర

బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి బొగ్గు బావుల పరిరక్షణకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి పట్టణంలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ మండల కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉదయం 10 గంటలకు పట్టణంలోని కాంటా చౌరస్తాలో  యాత్రను సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, పెళ్ల ఆశయ్య ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

ఈ యాత్రను జులై 29 నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగుతుందన్నారు. వామపక్ష పార్టీలు, ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, సామాజిక సంఘాలు పాల్గొని జయప్రదం  చేయాలనికోరారు.