పటాన్చెరు, వెలుగు: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. సంగారెడ్డి, పటాన్చెరులో ట్రాఫిక్ సీఐలు సుమన్, లాలూ నాయక్ఆధ్వర్యంలో విద్యా సంస్థలకు చెందిన బస్సు డ్రైవర్లకు సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్టెస్టులు నిర్వహించారు. బీఆర్ఐటీ బస్సు డ్రైవర్ మద్యం సేవించినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని, బస్సు సీజ్ చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్టెస్టులు నిర్వహించిన తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని సూచించినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయని ఎస్పీ అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.