Telangana Budget : హైదరాబాద్ మెట్రో, మూసీ ప్రాజెక్టులకు భారీగా నిధులు

తెలంగాణ బడ్జెట్ 2024లో హైదరాబాద్ మెట్రో రైలు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 

హైదరాబాద్ మెట్రోను సిటీ నలువైపుల మరింత విస్తరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్.

  • ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు
  • ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణకు రూ. 200 కోట్లు
  • హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు
  • ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం రూ.500 కోట్లు

Also Read :- Telangana Assembly Budget 2024-25

అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు సైతం భారీగా నిధులు కేటాయించింది సర్కార్. ఈ బడ్జెట్ లో ఏకంగా 15 వందల కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. 

హైదరాబాద్ సిటీ విస్తరణ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో నిధులు కేటాయించటం ద్వారా.. ఈ రెండు ప్రాజెక్టుల్లో వేగం పుంజుకోనుంది.