బడ్జెట్ 2024: ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. ఇదెక్కడి న్యాయం..?

ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓ పక్క ఏపీకి 15 వేల కోట్ల నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించారు. కానీ తెలంగాణకు హైదరాబాద్‌-- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి అత్తెసరు నిధులు మినహా మరెక్కడా తెలంగాణకు నిధుల ప్రస్తావన తేలేదు. గత 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్‌లోనూ తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపారు. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మళ్లీ  భంగపాటే ఎదురైంది.