బడ్జెట్‌‌లో మాకే ద్రోహం చేస్తరా?: స్టాలిన్

చెన్నై: కేంద్ర బడ్జెట్‌‌లో  తమ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. బడ్జెట్‌‌లో తమిళనాడుకు ద్రోహం చేసినందుకు జూలై 27న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దేశ బడ్జెట్ అన్ని రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరించేలా ఉండాలిగాని..నిర్మలా సీతారామన్ బడ్జెట్‌‌ అలా లేదని మండిపడ్డారు.  

బడ్జెట్‌‌లో అసలు తమిళనాడు అనే పదమే వాడకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాలు, అధికారాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారని ఫైర్​ అయ్యారు. తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంతోపాటు ఢిల్లీలో బుధవారం డీఎంకే ఎంపీలు నిరసన తెలుపుతారని స్టాలిన్ పేర్కొన్నారు.