బడ్జెట్ 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల లోన్

లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2024-25లో భాగంగా విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు రూ.10లక్షల వరకూ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్య, ఉద్యోగం, నైపుణ్యాల కల్పనకు మొత్తంగా రూ.1.48 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

 

ఉన్నత చదువు కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. గరిష్ఠం 10 లక్షల రూపాయల వరకు జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి అప్పు ఇచ్చే విధంగా విధివిధానాలు రూపొందించినట్లు వెల్లడించారామె.