బడ్జెట్ 2024: యువత కోసం 5 పథకాలతో పీఎం ప్యాకేజీ

లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్ లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టామన్నారు. అందులో భాగంగా ఐదు పథకాలతో కలిపి పీఎం ప్యాకేజీ తీసుకొచ్చామన్నారు. దీనికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించామన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. 

ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఉపాధి రంగం ఏదైనా తొలి నెల వేతనం కింద రూ. 15,000 నగదు బదిలీ పథకంతో కలిపి మొత్తం రూ.2 లక్షల కోట్లు యువతకు కేటాయించామన్నారు.