బడ్జెట్ 2024: రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయింపు

లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు  ఈ బడ్జెట్ లో రూ.1.52 లక్షల కోట్లు కేటాయించామన్నారు.  వచ్చే రెండేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి సేద్యాన్ని చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. 400 జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. 5 రాష్ట్రాల్లో కిసాన్ కార్డుల్ని అందిస్తామన్నారు. రొయ్యల పెంపకం, ఎగుమతికి నాబార్డు ద్వారా సాయం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

ALSO READ : బడ్జెట్ 2024: ముద్ర లోన్ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు