బడ్జెట్ 2024: తగ్గనున్న బంగారం, మొబైల్స్ ఫోన్ ధరలు

లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల ప్రసంగించారు.  ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. మరో వైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

ALSO READ : బడ్జెట్ 2024 : మౌలిక వసతులకు బూస్టింగ్.. ఏకంగా 11 లక్షల కోట్లు కేటాయింపు