బడ్జెట్ 2024: బీహార్, ఆంధ్రప్రదేశ్ పై నిధుల వర్షం

2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం ఈ రెండు రాష్ట్రాలకు కలిసివచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ నుంచి మొత్తం 17 ఎంపీ సీట్లు మద్దతుగా ఉన్నాయి. అందులో12 సీట్లు నితీశ్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ యునైటెడ్ పార్టీ నుంచి, 5 ఎంపీ సీట్లు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని  లోక్ జన్ శక్తి పార్టీ నుంచి ఉన్నాయి.

 కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి 18 ఎంపీ సీట్లు మద్దతు ఉన్నాయి. అందులో టీడీపీ 16, జనసేన 2 ఎంపీ సీట్లు భాగస్వామ్యమయ్యాయి.  కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ  ప్రభుత్వాలున్న AP, బిహార్ పై ఈ బడ్జెట్ లోనిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. బీహార్ లో  రోడ్ల అభివృద్ధికి రూ.26 వేల కోట్ల సాయంతో పాటుగా ఎయిర్ పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టనుంది.