బడ్జెట్ 2024: వికసిత్ భారత్ 2047​పై దృష్టి.. ఐదేళ్ల రోడ్‌మ్యాప్ తో బడ్జెట్

ప్రధాని మోదీ ఆలోచన వికసిత్‌ భారత్‌ 2047 విజన్‌కు అనుగుణంగా మౌలికవసతుల అభివృద్ధి, రక్షణ రంగంలో ఆధునికీకరణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యసేవలు తదితర తొమ్మిది రంగాలపై ఈ పద్దులో ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 
వికసిత్ భారత్ లక్ష్యంగా తొమ్మిది అంశాలపై ఫోకస్ చేస్తున్నామన్నారు.. అవేంటంటే :
1. వ్యవసాయం
2. ఎంప్లాయిమెంట్
3. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి 
4. ఉత్పత్తి, సర్వీసు రంగాలపై ఫోకస్
5. పట్టణాభివృద్ధి, స్మార్ట్ సిటీస్
6. ఇంధన రంగం
7. మౌలిక వసతుల కల్పన
8. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం
9. రాబోయే తరానికి తగ్గట్టు సంస్కరణలు