ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లో చేరికలు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: వేమనపల్లి మండలంలో బీఆర్ఎస్​ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వేమనపల్లి మాజీ ఎంపీపీ ఆకుల లింగాగౌడ్​తో పాటు 100 మంది బీఆర్ఎస్​ నాయకులు మాజీ జడ్పీటీసీ సంతోష్​కుమార్​ అధ్యక్షతన శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్​ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 20 రోజుల కింద మాజీ ఎంపీపీ వెంకటేశం, బీఆర్ఎస్​ నాయకులు కాంగ్రెస్​లో చేరారు. 

అంబాల శ్రీనివాస్, సంతోష్, చిరంజీవి, శంకర్, పవన్, రూపేశ్, దస్నాపూర్​ గ్రామానికి చెందిన రాజేశ్​గౌడ్, తిరుమలేశ్, సంతోష్ గౌడ్, రామాగౌడ్, రాజాగౌడ్, మహేశ్ గౌడ్​ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మాజీ ఎంపీపీ లింగాగౌడ్​ మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీలో చేరడంతో సొంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. వేమనపల్లి మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు సాబీర్​ అలీ, మాజీ సర్పంచులు గాలి మధు, తిరుపతిరెడ్డి, కొమురం రమేశ్, చెన్నూరి పురుషోత్తం పాల్గొన్నారు.