తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం..ఐదున్నర నెలల తర్వాత కేసీఆర్ను కలిసిన కవిత

ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు ఎమ్మెల్సీ కవిత. జైలు నుంచి రిలీజ్ తర్వాత తొలిసారి తండ్రితో కవిత భేటీ అయ్యారు. ఐదున్నర నెలల తర్వాత తండ్రిని కలిసిన ఆమె   కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.  కన్న బిడ్డను చూడగానే భోవోద్వేగానికి గురయ్యారు కేసీఆర్.10 రోజులపాటు ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే ఉండనున్నారు కవిత. తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని కవిత రిక్వెస్ట్ చేశారు.    

Also Read :- 75 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

 డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ,సీబీఐ కేసులో కవితకు ఆగస్టు 27న సుప్రీం కోర్టు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే..ఆగస్ట్ 28 ఆమె హైదరాబాద్ కు వచ్చారు. బంజారాహిల్స్‌‌లోని తన నివాసంలో తల్లి శోభమ్మను ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడిన ఆమె.. రానున్న 15 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తొలుత పార్టీ నేతలు, కార్యకర్తలకు సమయం కేటాయిస్తానని తెలిపారు. న్యాయం గెలిచిందని, తన పోరాటం ఇంకా కొనసాగుతుందని అన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తదని ధీమా వ్యక్తం చేశారు.