రఘునందన్​రావుకు ఓట్లడిగే హక్కు లేదు : రాజనర్సు

  • బీఆర్ఎస్ నేతలు రాజనర్సు, పాల సాయిరాం

సిద్దిపేట టౌన్, వెలుగు: మెదక్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సిద్దిపేట ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ నాయకులు కడవెర్గు రాజనర్సు, పాల సాయిరాం విమర్శించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీశ్​రావు నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన భూ నిర్వాసితులకు చట్ట ప్రకారమే డబ్బులు చెల్లించామని, ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. 

అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు సమన్యాయం చేశారన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు సిద్దిపేట అభివృద్ధిపై అసూయపడేవారని, ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. యాక్సిడెంటల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి రఘునందన్ రావు అని అయన ఓట్ల కోసం అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేటకు రైలు తీసుకొచ్చింది మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రి హరీశ్ రావులే అన్నారు. సమావేశంలో రాములు, రామచంద్రం, ముత్యాల కనకయ్య,  శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.