చేర్యాల, వెలుగు: నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ పరామర్శించేందుకు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడంపై చేర్యాలలో బీఆర్ఎస్ నాయకుల సోమవారం రాస్తారోకో చేపట్టారు.
హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు వెళ్లిన పల్లాను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ స్వరూప రాణి, ఎంపీపీ కర్ణాకర్, వెంకట్ రెడ్డి, కృష్ణమూర్తి, నాగేశ్వర్, సంతోష్ , అంజయ్య పాల్గొన్నారు.