కొమ్మూరి ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరికలు

చేర్యాల, వెలుగు: మండలంలోని వీరన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ భిక్షపతి, ఉపసర్పంచ్​ వెంకటేశం, బీఆర్ఎస్​ఉపాధ్యక్షుడు మధు, మైనార్టీ అధ్యక్షుడు కలీం, యూత్​అధ్యక్షుడు సంతోష్​కుమార్​తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్​లో చేరారు. 

ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవి, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్​, రాష్ట్ర నాయకులు మల్లేశం, శంకరయ్య, నర్సయ్య, గణేశ్​, రాకేశ్​ ఉన్నారు.