కాగజ్ నగర్, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇట్యాల మాజీ ఎంపీటీసీ గజ్జెల సురేశ్ జయలక్ష్మి ఆధ్వర్వంలో కాగజ్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దహెగాం మండలం ఇట్యాల, రాళ్లవాగు, బోర్ల కుంట
కోత్మీర్, గొర్రె గుట్ట గ్రామాల నుంచి ఎంపీపీ పిల్లల శంకరయ్య, మాజీ సర్పంచ్ లు మురళి, రాంటెంకి మల్లేశ్, పెద్ది శ్రీనివాస్, రైతు కమిటీ అధ్యక్షుడు కొండ్ర జగ్గ గౌడ్, ఉప సర్పంచ్ ఎస్కే షారిప్ తదితరులు కాంగ్రెస్కండువాలు కప్పుకున్నారు.