పెంచిన పన్నులు తగ్గించాలి : రవీందర్ గౌడ్

తూప్రాన్ , వెలుగు: మున్సిపల్ పరిధిలో ఉన్న ఇళ్లు, షాప్​లపై పెంచిన పన్నులను విత్​డ్రా చేసుకోవాలని కోరుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తూప్రాన్ లోని  బస్టాండ్ నుంచి  మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెంచిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమం సత్య లింగం, దుర్గారెడ్డి, మల్లేశ్, వెంకట్ గౌడ్, సత్తార్, శ్రీకాంత్, యాసీమ్ పాల్గొన్నారు. కాగా మున్సిపల్ ఆఫీసుకు వచ్చి న్యూసెన్స్ చేశారని కమిషనర్ కాజా మొయినుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ తో పాటు 19 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందం తెలిపారు.