ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జరిగాయి. జిల్లా చేనేత సంఘం అధ్యక్షుడు అల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో స్థానికులు, యశ్వంత్ గూడ, మత్తడి గూడ, కొత్త గూడ, రాముల గూడ గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్, బీజేపీల నుంచి 500లకు పైగా మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు.
చీఫ్ గెస్ట్లుగా హాజరైన రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి హాజరై వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, షేక్ ఖలీద్, బి.రమేశ్, బి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.