లంచం ఇస్తేనే వ్యాపారం ముందుకు!

  • ప్రభుత్వ అధికారులకు లంచమిచ్చామని ఒప్పుకున్న 
  • 66 శాతం కంపెనీలు : లోకల్‌‌‌‌‌‌‌‌సర్కిల్స్‌‌‌‌‌‌‌‌ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని మెజార్టీ కంపెనీలు ప్రభుత్వ అధికారులకు ఏదో ఒక దశలో లంచాలు ఇచ్చామని ఒప్పుకున్నాయి. గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం ఇచ్చామని   సుమారు 66 శాతం కంపెనీలు తెలిపాయి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లోకల్‌‌‌‌‌‌‌‌సర్కిల్స్‌‌‌‌‌‌‌‌   మొత్తం 159 జిల్లాల్లోని కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ వివరాలను బయటపెట్టింది. ఈ సర్వే కోసం 18 వేల రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌లను సేకరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం,  బలవంతంగా  లంచం ఇవ్వాల్సి వచ్చిందని 54 శాతం బిజినెస్‌‌‌‌‌‌‌‌లు,  పనులు వేగంగా పూర్తి చేసేందుకు లంచం ఇవ్వడానికి వాలంటరీగా ముందుకొచ్చామని  46 శాతం బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ఒప్పుకున్నాయి.  ప్రభుత్వ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు  పర్మిట్స్‌‌‌‌‌‌‌‌ పొందడానికి, సప్లయర్ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌, ఫైల్స్‌‌‌‌‌‌‌‌, ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌, పేమెంట్స్ పొందడానికి  లంచం ఇచ్చుకోవల్సి వచ్చిందని    బిజినెస్‌‌‌‌‌‌‌‌లు తెలిపాయి.  ‘ప్రభుత్వ అనుమతులను వేగంగా పొందాలంటే లంచం ఇవ్వడం తప్పదని చాలా బిజినెస్‌‌‌‌‌‌‌‌లు పేర్కొన్నాయి. 

ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లో ఇదొక పార్ట్‌‌‌‌‌‌‌‌గా మారిందని చెప్పాయి. అథారిటీ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ డూప్లికేట్ కాపీ కోసం కూడా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని,  ప్రాపర్టీ సంబంధిత అంశాల్లో లంచం తప్పదని బిజినెస్‌‌‌‌‌‌‌‌లు పేర్కొన్నాయి.  గత ఏడాది కాలంలో వివిధ రూపాల్లో లంచం ఇచ్చుకున్నామని   66 శాతం  బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ఒప్పుకున్నాయి’ అని  లోకల్‌‌‌‌‌‌‌‌సర్కిల్స్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ పేర్కొంది. లంచం ఇవ్వకుండానే  పనులు పూర్తి చేసుకోగలిగామని 16 శాతం బిజినెస్‌‌‌‌‌‌‌‌లు,  లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదని 19 శాతం బిజినెస్‌‌‌‌‌‌‌‌లు పేర్కొన్నాయి.  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ ,  పొల్యూషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కొర్పొరేషన్‌‌‌‌‌‌‌‌,  పవర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులకు లంచాలు ఇచ్చామని చాలా కంపెనీలు వెల్లడించాయి. కానీ, గత 12 నెలల్లో లంచం లావాదేవీలు బాగా తగ్గాయని  బిజినెస్‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నాయి.