బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాల దానం

జైపూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) ఈ నెల 6వ తేదీన టేకుమట్ల వద్ద ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాలలో ఓ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ అందించారు. 

 మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో  శ్రీకాంత్ కుటుంబసభ్యులు జీవనాదాన్ అవయవమార్పిడి సంస్థను కామినేని ఆస్పత్రి ద్వారా శ్రీకాంత్‌ కు చెందిన రెండు కిడ్నీలు, లివర్, హార్ట్, రెండు కళ్లు, ఉపిరితిత్తులను అవయవదానం చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడు శ్రీకాంత్ కు భార్య స్వప్న, తొమ్మిది ఏళ్ల కొడుకు ఉన్నాడు.