ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్

మనోహరాబాద్, వెలుగు:   ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో ప్రియుడు సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్​జిల్లా మనోహరాబాద్​మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సోహెల్(24) ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. కాగా ఆ అమ్మాయి ఇంట్లో సొహెల్ పెళ్లి గురించి చెప్పగా ఒప్పుకోలేదు. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో మనస్తాపం చెందిన సోహెల్ సోమవారం రాత్రి 11 గంటలకు ఇంట్లో శాలువాతో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం తూప్రాన్ గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు.