ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

నేరడిగొండ, వెలుగు: ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామంలో జగదాంబ దేవి, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలని ఆలయాన్ని రూ.43 లక్షలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. మండలంలోని చిన్న బుగ్గారం గ్రామంలో జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద రూ.12 లక్షల వ్యయంతో నిర్మించే మండపాల నిర్మాణానికి బంజారా సాంప్రదాయాలతో భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.