సంగారెడ్డి టౌన్ , వెలుగు: బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహం వద్ద జిల్లా అధ్యక్షుడు బొర్ర ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అదనంగా పోస్టులు కలపాలని, టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోచారం రాములు, రాజు గౌడ్, ముత్తిరెడ్డి , శ్రీనివాస్, రవి, అనిల్, ఆదిత్య, ప్రశాంత్, అరవింద్, సాయి తేజ, ప్రమోద్, మనికంట, శివ, కార్తీక్, నరేశ్, గిరిధర్, ప్రశాంత్, మహేశ్, వెంకట్ పాల్గొన్నారు.