విశాక ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేత

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేట సమ్మక్క జాతరకు శుక్రవారం విశాక ట్రస్టు ద్వారా బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేశారు. ఇటీవల బోజన్నపేటకు చెందిన బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో జాతర కమిటీ సభ్యులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిశారు. జాతర వద్ద తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు చేయాలని విశాక ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యులను ఆదేశించారు. 

ఈ క్రమంలో శుక్రవారం బోర్​మోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జాతర కమిటీకి అందజేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పోల్సాని సుధాకర్ రావు,  తిరుపతిరావు, చంద్రయ్య, ప్రసాద్, సతీశ్, శ్రీధర్, వాసు, శ్రీనివాస్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నర్సింగం తదితరులు ఉన్నారు.