బోడ కాకర కిలో రూ.400

నేరడిగొండ, వెలుగు: వర్షాకాలం సీజన్​లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు కొండెక్కాయి. వానాకాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని డాక్టర్లు చెబుతుంటారు. 

అటవీ ప్రాంతంలో దొరికే వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో కిలో రూ.400 పలుకుతోంది. కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో రేటు ఎక్కువైనా జనం వీటిని కొంటున్నారు.