10 నిమిషాల్లో బ్లింకిట్ అంబులెన్స్‌‌ సర్వీస్‌‌లు

న్యూఢిల్లీ: క్విక్‌‌కామర్స్ కంపెనీ బ్లింకిట్‌‌ అంబులెన్స్‌‌ సర్వీస్‌‌లను కూడా మొదలుపెట్టింది. గురుగ్రామ్‌‌లో ‘10 నిమిషాల్లో అంబులెన్స్ సర్వీస్‌‌’లను లాంచ్ చేసింది.   సిటీలలో వేగంగా అంబులెన్స్‌‌ సర్వీసెస్‌‌లు పొందడం కష్టంగా మారిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు మొదటి అడుగు వేశామని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్‌‌‌‌ ధిండ్సా అన్నారు.  రానున్న రెండేళ్లలో దేశంలోని ఇతర సిటీలలో కూడా ఈ సర్వీస్‌‌లు లాంచ్ చేస్తామని  చెప్పారు. 

ఆక్సిజన్ సిలిండర్లు, ఆటోమెటిక్‌‌ ఎక్స్‌‌టర్నల్‌‌ డిఫిబ్రిలేటర్‌‌‌‌, స్ట్రెచర్‌‌‌‌, మానిటర్‌‌‌‌, సక్షన్ మెషీన్‌‌ వంటి ఎక్విప్‌‌మెంట్లు తమ అంబులెన్స్‌‌లలో ఉంటాయని, ప్రతీ అంబులెన్స్‌‌లో ఒక పారామెడిక్‌‌, అసిస్టెంట్‌‌, డ్రైవర్ ఉంటారన్నారు.