పదిమంది స్టూడెంట్స్ కి బ్లాక్ బెల్ట్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఆత్మ రక్షణ కోసం కరాటే దోహదపడుతుందని వెన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ జనరల్ సెక్రెటరీ రమేశ్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలో బ్లాక్ బెల్ట్ అవార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 100 మంది పాల్గొన్న కార్యక్రమంలో పదిమంది స్టూడెంట్స్​ప్రతిభ కనబరిచి బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు.

వారిలో హిమబిందు ,వర్షా ,నితీశ్ కుమార్, శివకుమార్ ,అఖిల్ గౌడ్, షానుద్దీన్, షయాన్, సూర్యకిరణ్ ఉన్నారు. కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షులు వేణు గోపాల్, శ్రద్ధ స్కూల్ ప్రిన్సిపాల్ పాండు, ప్రసాద్ మాస్టర్, సిరాజ్, లక్ష్మి, అశోక్ , కల్యాణ్, వెంకటరెడ్డి, వంశీ తదితరులు  పాల్గొన్నారు.