గుండెపోటుతో బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మృతి

బెల్లంపల్లి, వెలుగు:  బీజేపీ బెల్లంపల్లి టౌన్ వైస్ ప్రెసిడెంట్ అడిచెర్ల రాంచందర్ సోమవారం గుండె పోటుతో మృతి చెందారు. పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీకి చెందిన రాంచందర్ కు తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతం లో గుండె పోటు రావడంతో కుటుంబీకులు స్థానిక ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. 

మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ధార కళ్యాణి, రాష్ట్ర సీనియర్  నాయకుడు రేవెల్లి రాజలింగు తదితరులు హాజరై ఆయన మృతదేహానికి  నివాళులర్పించారు. ఆయన మృతి బీజేపీ పార్టీకి తీరనిలోటని వారు పేర్కొన్నారు.