హామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలా : ఎమ్మెల్యే రామారావు

భైంసా, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం ఏడాది పాలన పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శించారు. మంగళవారం భైంసా మండలంలోని వాటోలి గ్రామంలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. రూ.2లక్షల నిధులతో నిర్మించనున్న పాఠశాల మరుగుదొడ్లు, రూ.లక్షల గ్రామీణ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతుంటే  ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

ప్రజా విజయోత్సవంలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించే ఆలోచన లేనప్పటికీ.. ప్రజా సమస్యలు చూస్తుంటే తప్పడంలేదన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు వేచి చూస్తున్నారని ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంలో  ఒకేసారి రైతు భరోసా వచ్చిందని, 65 శాతం రైతులకు రుణమాఫీ అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తక్షణమే రుణమాఫీ చేయాలన్నారు. ఎంపీడీవో  సుధాకర్ రెడ్డి, ఎంపీవో మొజామ్, ఏపీవో శివలింగయ్య, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సోలంకే భీంరావు,  సీనియర్ అడ్వకేట్ గంగాధర్, మహిళా మోర్చ నాయకురాలు సిరం సుష్మారెడ్డి, నాయకులు తాలోడ్ శ్రీనివాస్, అశోక్, సుభాష్, గంగాప్రసాద్, భూమేశ్ తదితరులు 

పాల్గొన్నారు.