రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రికి వినతి

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ పనులను ప్రారంభించాలని స్థానిక బీజేపీ నాయకులు మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్వామివారి ప్రసాదం అందజేసి ఘనంగా సన్మానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ పథకంలో కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని చేర్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సానది కర్ణాకర్, ఎక్కలదేవి మధు, వినయ్ కుమార్, రాజు, రమేశ్ పాల్గొన్నారు.