- చెన్నూరులో కాంగ్రెస్ నాయకుల నిరసన
చెన్నూరు,వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తన్వీర్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిత హేమంతరెడ్డి, చెన్నూరి శ్రీధర్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
వెంటనే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి,పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, చీర్ల సుధాకర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, గజ్జల అంక గౌడ్, పాతర్ల నాగరాజు, తిరుపతి, లింగంపల్లి మహేశ్, అన్వర్, సుల్తాన్, నారాయణ, మహేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.