ఎంపీలను సన్మానించిన బీజేపీ నాయకులు

బెజ్జంకి, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన  బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ను కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద  మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు కలిశారు.  రెండో సారి ఎంపీగా గెలువడంతో ఆయనకు  బొకే ఇచ్చి, సన్మానించారు.  రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్నతమైన పదవులు అందుకొని,  కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ మండల కార్యదర్శి అనిల్ రావ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఈటల,రఘునందన్ కు అభినందనలు..

మనోహరాబాద్ :  ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఈటల రాజేందర్,రఘునందన్ రావును  బీజేపీ జిల్లా నాయకులు నత్తి మల్లేశ్​, శేఖర్ బుధవారం అభినందనలు తెలిపారు.