మంచిర్యాల, వెలుగు: ఆర్మూర్- మంచిర్యాల మధ్య నిర్మించనున్న ఎన్ హెచ్63ని రైతుల భూములకు నష్టం జరగకుండా విస్తరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు కోరారు. శుక్రవారం ఆయన ఎన్హెచ్ఏఐ హైదరాబాద్ రీజియన్ ఆఫీసర్ శివశంకర్‌ను కలిసి మెమోరాండం అందించారు.
ఎన్‌హెచ్ 63 విస్తరణలో భాగంగా లక్సెట్టిపేట, హాజీపూర్మండలాల రైతులు భూములు కోల్పోతున్నారని తెలిపారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయారని, ఎన్‌హెచ్ కోసం మరోసారి నష్టపోతారని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, పలువురు నాయకులు, రైతులు ఉన్నారు.