మెదక్ లో బీజేపీ విక్టరీ .. రఘునందన్ రావు ఘన విజయం

  • 39,139 ఓట్ల మెజార్టీ
  • రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్​
  • సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్​ 

మెదక్, వెలుగు:  ప్రతిష్టాత్మకంగా జరిగిన మెదక్​లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్​ రావు 39,139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధు రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీఆర్ఎస్​సిట్టింగ్​ స్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది.

 మొదటి నుంచి లోక్​సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ విన్నా ఈ సారి మెదక్​లోక్​సభ స్థానంలో బీజేపీ గెలుస్తుందనే టాక్​ వినిపించింది. అయితే మౌత్ టాక్​ బీజేపీకి అనుకూలంగా ఉన్నా  బీజేపీ గెలుపు అంత ఈజీ ఏమీ కాదు, బీఆర్ఎస్​, కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఉంటుందని అంచనా వేసినా విజయం మాత్రం కమలానికే దక్కింది. 

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లు

సెగ్మెంట్    బీజేపీ     కాంగ్రెస్​    బీఆర్​ఎస్
మెదక్    67,374    55,588    40,776
నర్సాపూర్​    51,811    72,376    54,372
సంగారెడ్డి    70,310    75,287    27,874
పటాన్​చెరు    1,03,775    92,294    54,581
సిద్దిపేట    62,823    33,174    65,501
గజ్వేల్​    56,811    65,539    85,432
దుబ్బాక    50,873     31, 641    66,71 4

మెదక్​ లోక్​ సభ రౌండ్​ల వారీ ఓట్లు

రౌండ్    బీజేపీ     కాంగ్రెస్     బీఆర్​ఎస్​
1    20,754    19,477    22,296
2    21,267    21,622    20,445    
3    23,365    22,174    20,914 
4    19,668    19,125    22,198
5    21,721    19,689    21,772
6    25,222    18,633    18,391
7    21,717    22,148     17,743 
8    22,262    19,323    18,110
9    24,838    19,099     15,149
10    22,557    22,342    15,515
11    24,686    20,885    24,686
12    26,332    20,572    15,588
13    22,872    22,053    18,830
14    21,359    21,482    19,887
15    22,526    21,866    20,516
16    22,065    20,807    19,525
17    24,207    21,587    20,816
18    20,750    20,569     19,789    
19    17,873     18,306    18,315
20    15,197    13,546    13,798
21    9,666    10,667    9,475
22    8,237    8,271    7,098
23    4,636    3,656    2,370