నిర్మల్ లో చివరి ఆయకట్టు వరకు సాగునీరందాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సోన్ మండలం గాంధీనగర్ వద్ద  ఎస్సారెస్పీ  నుంచి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరస్వతి కాల్వకు 500 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు అనుకూలమైన పంటలు సాగుచేసి అధిక లాభాలు గడించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలన్నారు. అంతకుముందు గంగా మాతకు బీజేపీ నాయకులు, ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి మహేశ్వర్ రెడ్డి పూజలు చేశారు. 

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

నిర్మల్ టౌన్ తోపాటు మామడ, లక్ష్మణచాంద మండలాలకు చెందిన 279 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు.

ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగొద్దు

లక్ష్మణచాంద(మామడ): మామడ మండలం పొన్కల్ సమీపంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ మినీ బ్యారేజీని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సందర్శిచారు. ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. వారికి తగిన నష్టపరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 
గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా, మండల నాయకులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.