రుణమాఫీపై ప్రధానిని సీఎం పక్కదోవ పట్టిస్తుండు..

  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్, వెలుగు: రుణ  మాఫీ విషయం లో ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్​ రెడ్డి పక్కదోవ పట్టిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానికి రాసిన లేఖపై తాను సీఎం రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమేనని, సీఎం బహిరంగ చర్చకు సిద్ధమైతే తేదీ, వేదిక ఖరారు చేయాలని సవాల్​ చేశారు. అధికారంలోకి రాగానే రైతులందరికీ రెండు లక్షల మాఫీ చేస్తామని, ఆరు నెలలు దాటినా రుణమాఫీ హామీ అమలు పూర్తి కాలేద న్నారు. 

ఇప్పటి వరకు సగం మంది రైతు లకు కూడా రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. ఇదే విషయాన్ని ఈనెల 5న మహారాష్ట్రలో జరి గిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారని వివరించారు. ఆగస్టు 15 కల్లా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చే స్తామంటూ దేవుళ్లపై ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఆ దేవుళ్లను సైతం మోసం చేశాడని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జి రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్ తదితరులు 
పాల్గొన్నారు.