2024 లో 2.61 కోట్ల  బైక్​ల అమ్మకం

న్యూఢిల్లీ: బండ్ల అమ్మకాలు 2024 లో 2.61 కోట్ల యూనిట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 9 శాతం  వృద్ధి చెందాయి.  కరోనా ముందు అంటే 2018 లో రికార్డ్‌‌ లెవెల్‌‌లో 2.54 కోట్ల బండ్లు అమ్ముడు కాగా,  2024 లో ఈ  రికార్డ్‌‌ బ్రేక్ అయ్యింది. 2023 లో 2.4 కోట్ల బండ్లు అమ్ముడయ్యాయి.                    

ఈ ఏడాది మాత్రం ప్యాసింజర్ బండ్లు (కార్ల) సేల్స్ పెద్దగా పెరగకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  టూవీలర్ అమ్మకాలు 2024 తో పోలిస్తే 6–8 శాతం, ట్రాక్టర్‌‌‌‌ సేల్స్   3–5 శాతం పెరగొచ్చని,  కమర్షియల్ వెహికల్స్ సేల్స్‌‌ మాత్రం ప్రభుత్వం చేసే ఖర్చులపై ఆధారపడి ఉంటుందని వివరించాయి.  

ఎలక్ట్రిక్ బండ్ల అమ్మకాలు కూడా 2024 లో రికార్డ్ లెవెల్‌‌కు చేరుకున్నాయి. 2023 లో  15 లక్షల ఈవీలు అమ్ముడు కాగా, 2024 లో 19.5 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి. కిందటేడాది అమ్ముడైన 2.61 కోట్ల బండ్లలో 74 శాతం పెట్రోల్ బండ్లు, 1‌‌‌‌0 శాతం డీజిల్ బండ్లు ఉన్నాయి.