కాంగ్రెస్ నేతల బైక్​ ర్యాలీ

బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో చిలాపూర్, నరసింహుల పల్లె, ముత్తన్నపేట్, దాచారం, వీరాపూర్, లక్ష్మీపూర్, బేగంపేట్, వడ్లూరు, గూడెం గ్రామాల్లో ఎల్లుండి జరిగే ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్  కాంగ్రెస్​అభ్యర్థి వెలిచాల  రాజేందర్​రావును గెలిపించాలని శుక్రవారం కాంగ్రెస్ నేతలు బైక్​ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు బుక్ ఇస్తా రత్నాకర్ రెడ్డి  చేతి గుర్తుకే ఓటు వేయాలని నినాదాలు చేశారు. ప్రతీ కార్యకర్త ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.