చైనాలో టన్నుల్ టన్నులే బంగారం.. దాని విలువ తెలిస్తే షాక్!

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాలు చైనాలో కనుగొనబడిందని ఓ అంతర్జాతీయ వార్త సంస్థ తెలిపింది. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో గనుల్లో 100 మెట్రిక్ టన్నుల బంగారం ఉండొచ్చని అంచనా. జియోలాజికల్ బ్యూరో అధికారులు హునాన్ లో సర్వే చేసి వెల్లడించిన వివరాలను తెలియజేసింది. భూగర్భ శాస్త్రవేత్తలు భూమిలోపల 40 కంటే ఎక్కువ టన్నుల బంగారం ఉందని చెప్పారు. భూమి పైనుంచి 3వేల మీటర్ల లోతులో ఈ గోల్డ్ మైన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు. దాని విలు మొత్తం సుమారు 83 బిలియన్ US డాలర్లు (రూ.701లక్షల కోట్లు) ఉండవచ్చు.

ఈ కోర్ శాంపిల్స్ అధ్యయనం ప్రకారం ఈ ప్రాంతంలోని 1 మెట్రిక్ టన్ను రాతిలో 138 గ్రాముల బంగారాన్ని తీయవచ్చని శాస్రవేత్తలు చెప్తున్నారు. వర్డల్ గోల్డ్ మార్కెట్‌లో చైనా ఇప్పటికే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చైనాలో 2000 టన్నులకు పైగా బంగారం నిల్వలున్నాయని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ అంచనా వేశారు. ప్రపంచంలోని బంగారంలో దాదాపు 10 శాతం చైనాలోని మైనింగ్ నుంచి వస్తుంది.